
Spunweb Nonwoven IPO: గడచిన కొన్ని వారాలుగా తిరిగి ఐపీవోల మార్కెట్ల పై దేశీయ ఇన్వెస్టర్లు తిరిగి భారీ బెట్టింగ్స్ వేస్తున్నారు. అమెరికా పరిపాలన గందరగోళ నిర్ణయాలతో ఈక్విటీ మార్కెట్లు కొంత ఊగిసలాటకు గురవుతున్నప్పటికీ ఐపీవోలకు మంచి ట్రాక్షన్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల మార్కెట్లలోకి వచ్చిన అనేక ఐపీవోలు ఊహించిన దాని కంటే మెరుగైన లిస్టింగ్ లాభాలను ఇన్వెస్టర్లకు అందించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లో లిస్టింగ్ కోసం వస్తున్న స్పన్‌వెబ్ నాన్‌వోవెన్ కంపెనీ గురించే. కంపెనీ తన ఐపీవో బిడ్డింగ్ ఈనెల 14 నుంచి 16 వరకు అందుబాటులో ఉంచింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అలాట్మెంట్ ప్రక్రియ నేటి నుంటి స్టార్ట్ కానుందని వెల్లడైంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.60కోట్ల 98 లక్షలు సమీకరించాలని నిర్ణయించింది.
ఐపీవో సమయంలో తన ప్రైస్ బ్యాండ్ గరిష్ఠ ధరను కంపెనీ షేరుకు రూ.96గా ప్రకటించింది. అలాగే లాట్ పరిమాణం 1200 షేర్లుగా ఉంచింది. వాస్తవానికి బిడ్డింగ్ మూడు రోజుల కాలంలో మెుత్తంగా ఐపీవో 251 రెట్ల కంటే ఎక్కువ సబ్ స్క్రిప్షన్స్ పొందింది. ఇందులో ప్రధానంగా నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతో పాటు క్వాలిఫైన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువగా బిడ్డింగ్స్ వచ్చాయి. కంపెనీ ఐపీవోలో రూ.61 కోట్లు అడగగా.. ఇన్వెస్టర్లు షేర్లను దక్కించుకునేందుకు బిడ్డింగ్ దరఖాస్తుల రూపంలో రూ.10వేల కోట్లను కుమ్మరించటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read :గోల్డ్-సిల్వర్ కొనేవారికి ఊరట
బిడ్డింగ్ చివరి రోజున గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్కోటి ఇష్యూ ధర కంటే రూ.42 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. దీని ప్రకారం కంపెనీ షేర్లు లిస్టింగ్ రోజున కనీసం 35 నుంచి 40 శాతం మధ్య రాబడిని అందించవచ్చని అంచనాలు ఉన్నాయి.
కంపెనీ వ్యాపారం..
2015లో స్థాపించబడిన స్పన్‌వెబ్ నాన్‌వోవెన్ సంస్థ.. ప్రధానంగా డోర్‌మ్యాట్‌లు, బ్యాగులు, కార్పెట్‌లు, టార్పాలిన్‌ల వంటి అనువర్తనాలకు ఉపయోగించే నాన్-వోవెన్ బట్టల తయారీ, సరఫరా వ్యాపారంలో ఉంది. ఇది నాన్‌వోవెన్ బట్ట, లామినేటెడ్, UV ట్రీటెడ్ నాన్‌వోవెన్ బట్టలను తయారు చేస్తుంది.
షేర్ల అలాట్మెంట్ స్టేటస్ చెక్ చేయండి ఇలా...
1) https://www.nseindia.com/products/dynaContent/equities/ipos/ipo_login.jsp ని సందర్శించండి
2) మీరు రిజిస్టర్ కాకుంటే అవసరమైన అన్ని వివరాలతో సైన్ అప్ చేయండి.
3) మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
4) నేను రోబోట్ కాదని తనిఖీ చేయండి.
5) IPO బిడ్ వివరాల కాలమ్ తనిఖీ చేయబడిందని నిర్ధారించుకోండి.
6) డ్రాప్‌డౌన్‌లో కంపెనీని ఎంచుకోండి.
7) మీ పాన్ నంబర్‌ను తనిఖీ చేసి, అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేయండి.
8) 'గెట్ డేటా' బటన్‌ను నొక్కగానే మీకు షేర్ల అలాట్మెంట్ స్టేటస్ వివరాలు వస్తాయి.