
హైదరాబాద్ : రాబోయే 2 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనపై యుద్ధం చేయాలని సంకల్పం తీసుకున్నామన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. నిన్నటి ర్యాలీ విజయవంతం కావడంతో మంత్రి కేటీఆర్ ఒత్తిడితో పోలీసులు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ర్యాలీ కోసం అంజన్ కుమార్ యాదవ్ దరఖాస్తు చేసినా అనుమతి ఇవ్వలేదన్నారు. పోలీసులు కేసీఆర్ బానిసలుగా మారి తమపై తప్పుడు కేసులు పెడ్తున్నారని ఫైర్ అయ్యారు శ్రవణ్. వాసాలమర్రిలో 5 వేల మందితో సీఎం సహపంక్తి భోజనం పెడితే కేసు ఉండదా అని ప్రశ్నించారు.