హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు సెక్రటరీగా శ్రీదేవసేనకు సర్కారు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న శృతి ఓజా ఏడాది పాటు స్టడీ లీవ్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు శుక్రవారం సీఎస్ శాంతికుమారి జీవో నెంబర్ 1210ని రిలీజ్ చేశారు.
యూకేలోని ఆక్స్ ఫర్డ్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ కోర్సుకు చేసేందుకు అవకాశం ఇవ్వాలని శృతి ఓజా ప్రభుత్వానికి విన్నవించగా, దానికి అంగీకరించింది. సెప్టెంబర్ 16, 2024 నుంచి సెప్టెంబర్ 15,2025 వరకూ ఏడాది స్టడీ లీవ్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలో కాలేజీ విద్యాశాఖ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీదేవసేనకు ఇంటర్ బోర్డు సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.