సూపర్ హీరో .. అద్భుత విజయంతో కెరీర్‌‌ ముగించిన శ్రీజేష్

సూపర్ హీరో .. అద్భుత విజయంతో కెరీర్‌‌ ముగించిన శ్రీజేష్

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్):  ఒలింపిక్స్ తన చివరి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అని  గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఆర్ శ్రీజేష్  ప్రకటించగానే  తన కోసం ప్రత్యేకంగా ఏదైనా చేస్తామని హామీ ఇస్తూ  మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాంస్య పతక మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా విజయం సాధించగానే మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్.. శ్రీజేష్​వైపు తిరిగి తల వంచి నమస్కరించాడు. మిగతా ఆటగాళ్లూ, కోచింగ్ సిబ్బందీ  శ్రీజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇలానే గౌరవించారు.

శ్రీజేష్ అంటే తోటి ఆటగాళ్లకు ఎంత ప్రేమ, గౌరవం ఉందో చెప్పే ఉదాహరణ ఇది. ఇండియా ఆటగాళ్లే కాదు హాకీని, ఆటలను అభిమానించే ప్రతీ ఒక్కరూ అతనికి సలాం కొట్టాల్సిందే. రెండు దశాబ్దాల పాటు ఇండియా హాకీ జట్టుకు శ్రీజేష్ అందించిన సేవలు చిరస్మరణీయం. వరుసగా రెండు ఒలింపిక్ పతకాలతో ఆట నుంచి వైదొలుగుతున్న శ్రీజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిపూర్ణం అయింది. 

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుతో  నిర్వేదంలో ఉన్న  దేశ ప్రజల ముఖాల్లో మన హాకీ జట్టు పతకం గెలిచి మళ్లీ ఆనందాన్ని నింపింది. మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు అంతగా ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేకపోయినా.. కఠినమైన గ్రూపులో బరిలో నిలిచినా.. అద్భుత ఆటతో ఒక్కో ప్రత్యర్థిని దాటుకుంటూ ముందుకొచ్చిన హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని జట్టు పతకం సాధించే వరకూ విశ్రమించలేదు.

ఈ టోర్నీలో పది గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టును ముందుండి నడిపించాడు. కానీ, జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర మాత్రం గోల్ కీపర్ పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇదే చివరి టోర్నీ అని చెప్పిన శ్రీజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పతకంతో ఆటను ముగించాలని పట్టుదలగా ఉండగా.. రెండు దశాబ్దాలుగా జట్టుకు వెన్నెముకగా ఉన్న అతనికి విజయంతో వీడ్కోలు పలకాలని ఆటగాళ్లూ కసిగా, కలిసి కట్టుగా ముందుకు సాగారు.  ఇండియా హాకీ జట్టు ‘కలల రక్షకుడి’గా పేరొందిన శ్రీజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన అనుభవాన్ని రంగరించి ఈ మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనేక క్లిష్ట సందర్భాల్లో జట్టును రక్షించాడు.

ఇండియా నుంచి నాలుగు ఒలింపిక్స్ ఆడిన ఏకైక గోల్ కీపర్ అయిన శ్రీ ప్రతీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ప్రత్యర్థులకు అడ్డు గోడగా నిలిచాడు. బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో క్వార్టర్ ఫైనల్లో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెరుపు వేగంతో కదులుతూ ఆ జట్టు గోల్ కొట్టకుండా అడ్డుకున్న అతను.. తాజాగా స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోరులో చివరి నిమిషంలోనూ మార్క్ మిరాలెస్ గ్రాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తన కుడి కాలుతో అడ్డుకొని ఇండియా కాంస్య పతకం నిలబెట్టుకునేలా చేశాడు.  బెల్జియంతో క్వార్టర్ ఫైనల్లో అయితే తను ఒంటి చేత్తో జట్టును గెలిపించాడని చెప్పొచ్చు. ఇప్పుడే కాదు 18 ఏండ్ల టీనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 2006 ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చినప్పటి నుంచి ఈ కేరళ యోధుడు చేస్తున్న పని అదే.  ఎన్నో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో తన ప్రతిభతో జట్టును గెలిపించాడు.  

ఇండియా అందుకున్న ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో తనూ భాగం అయ్యాడు.  18 ఏండ్ల  సుదీర్ఘ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశానికి 336 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడిన శ్రీజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండేసి ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాలుగుసార్లు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, రెండుసార్లు చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ట్రోఫీ, ఒకసారి ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా అందుకున్నాడు. 2021, 2022లో వరుసగా రెండుసార్లు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డులు గెలవడం అతని ప్రతిభకు నిదర్శనం. 

శ్రీజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్ కీపర్ అనడంలో సందేహం లేదు.  ఈ తరంలో క్రికెట్ దిగ్గజం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధోనీ, ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రికి ఏమాత్రం తీసిపోని స్థాయి అతనిది. హాకీ ఇష్టపడే చిన్నారులు తాము పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీజేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతామని చెప్పేలా చేసిన సూపర్ హీరో తను. ఇంతకంటే గొప్ప కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరికి ఉంటుంది.