పద్మారావునగర్, వెలుగు:తాడ్‌బండ్ మసీద్‌లో ముస్లింలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ బుధవారం రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ముస్లిం కుటుంబాలు ఆనందంగా రంజాన్ పండుగ జరుపుకునేందుకు ప్రభుత్వం ఈ సహాయం అందజేస్తోందన్నారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. జంపన ప్రతాప్, అబీద్, కరణ్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
