- ఇయ్యాలే ప్రధాన ఘట్టం
జీడిమెట్ల, వెలుగు: సూరారం శ్రీకట్టమైసమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ప్రారంభంలో భాగంగా శనివారం ఉదయం సుప్రభాత సేవ, అభిషేకం, మధ్యాహ్నం మహానైవేద్యం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రధాన జాతర ఆదివారం జరగనుంది. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సూరారం సీఐ సుధీర్ కృష్ణ, ట్రాఫిక్ సీఐ నర్సింహరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
