చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీలంక.. ఫైనల్లో 128 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విక్టరీ

చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీలంక..  ఫైనల్లో 128 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విక్టరీ

హరారె: ఐసీసీ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. టోర్నీలో ఓటమి ఎరుగని లంక  ఆదివారం జరిగిన ఫైనల్లో 128 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకోవడంతో లంక, నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే ఇండియాలో జరిగే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయ్యాయి. ఫైనల్లో టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి తొలుత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన శ్రీలంక 47.5 ఓవర్లలో 233 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 

సహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరచిగె (57), కుశాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (43), అసలంక (36), హసరంగ (29) రాణించారు. డచ్ బౌలర్లలో వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ర్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జుల్ఫికర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..లంక  స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీక్షణ (4/30), పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిల్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధుషంక (3/18) దెబ్బకు  23.3 ఓవర్లలో 105 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒడౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (33) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. హసరంగ రెండు వికెట్లు పడగొట్టాడు. మధుషంకకు ప్లేయర్ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీన్​ విలియమ్స్​కు ప్లేయర్​ ఆఫ్ ద టోర్నీ అవార్డులు లభించాయి.