
అబుదాబి: ఆసియా కప్లో శ్రీలంక శుభారంభం చేసింది. టార్గెట్ ఛేజింగ్‌లో పాథుమ్ నిశాంక (50), కమిల్ మిశార (46 నాటౌట్) రాణించడంతో.. శనివారం (సెప్టెంబర్ 13) జరిగిన లీగ్ మ్యాచ్‌లో లంక 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. టాస్ ఓడిన బంగ్లా 20 ఓవర్లలో 139/5 స్కోరు చేసింది. షమీమ్ హుస్సేన్ (42 నాటౌట్), జాకెర్ అలీ (41 నాటౌట్) మెరుగ్గా ఆడారు.
తన్జిద్ హసన్ (0), పర్వేజ్ ఎమన్ (0), తౌహిద్ హ్రిదోయ్ (8), మెహిదీ హసన్ (9) నిరాశపర్చారు. 53/5తో కష్టాల్లో పడిన బంగ్లాను షమీమ్, జాకెర్ ఆరో వికెట్‌కు 86 రన్స్ జోడించి ఆదుకున్నారు. వానిందు హసరంగ 2 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 14.4 ఓవర్లలో 140/4 స్కోరు చేసి నెగ్గింది. కుశాల్ మెండిస్ (3), కుశాల్ పెరీరా (9), డాసున్ షనక (1) విఫలమయ్యారు. మెహిదీ హసన్ 2 వికెట్లు తీశాడు. కమిల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.