పెట్రోల్, డీజిల్ కు రేషన్ పెట్టిన శ్రీలంక : వారానికి ఏ బండికి ఎంత పోస్తారో తెలుసుకుందామా.. !

పెట్రోల్, డీజిల్ కు రేషన్ పెట్టిన శ్రీలంక : వారానికి ఏ బండికి ఎంత పోస్తారో తెలుసుకుందామా.. !

ఆయిల్ సంక్షోభం ఆసియా ఖండాన్ని అల్లకల్లోలం చేస్తోంది. శ్రీలంక దేశంలో ఇంధన సంక్షోభం వచ్చేసింది. ధరలు పెంచకపోయినా.. వాహనాలకు పోసే పెట్రోల్, డీజిల్ పై రేషన్ విధానం తీసుకొచ్చింది శ్రీలంక ప్రభుత్వం. QR కోడ్ ఆధారంగా.. వారానికి ఇంత మాత్రమే పోస్తాం అని రూల్స్ తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. శ్రీలంక దేశం తన ఇంధన అవసరాల కోసం విదేశాలపైనే ఆధారపడుతుంది. హర్మూజ్ జల సంధి నుంచే 80 శాతం ఇంధనం శ్రీలంక దేశానికి వస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ తో చేస్తున్న యుద్ధం కారణంగా.. శ్రీలంక దేశంలో ఆయిల్ నిల్వలు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఈ రేషన్ విధానాన్ని తీసుకొచ్చింది అక్కడి సర్కార్.

ఏ బండికి ఎంత పోస్తారో తెలుసుకుందామా.. ?

బైక్ / టూ వీలర్ : వారానికి 8 లీటర్ల పెట్రోల్ 
ఆటోలు : వారానికి 20 లీటర్లు పెట్రోల్ లేదా డీజిల్
కార్లు : వారానికి 25 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్
బస్సులు : వారానికి 100 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్
లారీలు : వారానికి 200 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్

వాహనాల నెంబర్లతో క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసింది అక్కడి ప్రభుత్వం. ఆయా పెట్రోల్ బంకుల్లో QR కోడ్ స్కాన్ చేయగానే ఆ వాహనం ఎప్పుడు ఆయిల్ కొట్టించుకున్నది అనేది స్పష్టంగా తెలుస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ కొట్టించుకోవటం కుదరదు అన్నమాట. 

శ్రీలంక దేశంలో 2 కోట్ల 20 లక్షల మంది జనం ఉన్నారు. ప్రస్తుతం ఆ దేశంలో 25 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇప్పట్లో ఆయిల్ వస్తుందన్న నమ్మకం లేకపోవటానికి.. ఉన్న ఆయిల్ నిల్వలను జాగ్రత్తగా ఉపయోగించుకోవటానికి.. ఉన్న నిల్వలను ఎక్కువ రోజులు వచ్చే విధంగా చూసేందుకు ప్రభుత్వం ఈ రేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి బుధవారం ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నది. దీని వల్ల ఇంధన వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం నిర్ణయించింది.