
ఆసియా కప్ లో శ్రీలంక వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం (సెప్టెంబర్ 15) హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. దుబాయి ఇంటర్నేషల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పసికూన హాంకాంగ్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంక వరుసగా రెండు విజయాలతో సూపర్-4 కు చేరువైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఛేజింగ్ లో శ్రీలంక 18.5 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి గెలిచింది. పాతుం నిస్సాంక (68) హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ ఓటమితో హాంకాంగ్ దాదాపు టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంకకు మంచి ఆరంభం లభించలేదు. హాంకాంగ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక ఓపెనర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. క్రీజ్ లో ఉన్నంత వరకు ఇబ్బందిపడిన కుశాల్ మెండీస్ 14 బంతుల్లో 11 పరుగులు చేసి ఒత్తిడిలో వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత కమిల్ మిషారాతో కలిసి నిస్సాంక 36 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హాంకాంగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి 10 ఓవర్లలో లంక 2 వికెట్ల నష్టానికి 65 పరుగులే చేయగలిగింది.
ఈ దశలో నిశాంక.. కుశాల్ పెరీరా (20)తో కలిసి 57 పరుగులు జోడించి లక్ష్యానికి దగ్గరగా తీసుకొని వచ్చారు. ఈ క్రమంలో నిస్సాంక తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ శ్రీలంక అలవోవోకగా గెలుస్తుందన్న సమయంలో హాంకాంగ్ ఒక్కసారిగా విజృంభించింది. వరుసగా వికెట్లను పడగొట్టి లంకను ఒత్తిడిలో పడేసింది. హాఫ్ సెంచరీ చేసిన నిస్సంకతో (68) పాటు కుశాల్ పెరీరా(20), అసలంక (2), కామిందు మెండీస్ (5) పెవీలియన్ కు క్యూ కట్టారు. తీవ్ర ఒత్తిడిలో హసరంగా (20) వరుస బౌండరీలతో జట్టుకు విజయాన్ని అందించాడు.
అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. నిజాకత్ ఖాన్ 52 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో చమీర రెండు వికెట్లు పడగొట్టాడు. హసరంగా, శనక లకు తలో వికెట్ దక్కింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన హాంకాంగ్ కు మంచి ఆరంభం లభించింది. జీషన్ అలీ, అన్షుమాన్ రాత్ తొలి వికెట్ కు 4.5 ఓవర్లలో 41 పరుగులు జోడించి పవర్ ప్లే లో లంక బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. వీరి ధాటికి పవర్ ప్లే లో హాంకాంగ్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసి పర్వాలేదనిపించింది.
పవర్ ప్లే తర్వాత బాబర్ హయత్ నాలుగు పరుగులే చేసి పెవిలియన్ కు చేరడంతో స్వల్ప వ్యవధిలో హాంకాంగ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జీషన్ అలీ, నిజాకత్ ఖాన్ జట్టును నిలబెట్టారు. జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. మూడో వికెట్ కు 61 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో జీషన్ అలీ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జీషన్ ఔటైనా నిజాకత్ ఖాన్ చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు ఒక మాదిరి స్కోర్ అందించాడు. తొలి 10 ఓవర్లలో 62 పరుగులు చేసిన హాంకాంగ్.. చివరి 10 ఓవర్లలో 87 పరుగులు చేసి ఆకట్టుకుంది.
Sri Lanka edge out Hong Kong, China in a close contest to make it two wins from two at the Asia Cup 👏
— ICC (@ICC) September 15, 2025
📝: https://t.co/5XeziiAj4D pic.twitter.com/Riwv0FCrAc