ఎయిటీస్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో జాలరి

ఎయిటీస్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో జాలరి

శ్రీహరి హీరోగా రాజ్ తాళ్లూరి డైరెక్షన్‌‌లో రూపొందుతోన్న చిత్రం ‘జాలరి’. మైత్రీ బాక్సాఫీస్ ప్రొడక్షన్‌‌లో ఆదిత్య పల్లా, రఘు కుడితిపూడి, సాయికిరణ్ బత్తుల, రక్తం దశరథ్ గౌడ్ నిర్మిస్తున్నారు. గురువారం పూజా  కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

హీరో వెంకట్ క్లాప్ కొట్టగా, దర్శకుడు సముద్ర కెమెరా స్విచాన్ చేశారు. ఎయిటీస్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్టు దర్శకుడు రాజ్ తాళ్లూరి చెప్పాడు. ఐదు భాషల్లో దీన్ని నిర్మిస్తున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.