
కౌలాలంపూర్: ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మలేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో శ్రీకాంత్ 24–22, 17–21, 22–20తో వరల్డ్ 18వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై సంచలన విజయం సాధించాడు. గంటా 14 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్ తొలి గేమ్‌లో గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. అయినా కీలక టైమ్‌లో వరుసగా పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో చివరివరకు పోరాడినా ప్రయోజనం దక్కలేదు.
హోరాహోరీగా సాగిన మూడో గేమ్‌లో రెండుసార్లు ఇద్దరు ప్లేయర్లు స్కోర్లను సమం చేసినా చివర్లో శ్రీకాంత్ నెట్ వద్ద డ్రాప్స్ వేసి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో ధ్రువ్–క్రాస్టో 22–24, 13–21తో టాప్‌సీడ్ జియాంగ్ జెన్ బాంగ్– వీ య జిన్ (చైనా) చేతిలో ఓడారు. తొలి గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చినా రెండో గేమ్‌లో చేతులెత్తేశారు. దాంతో టోర్నీలో ఇండియా నుంచి శ్రీకాంత్ ఒక్కడే మిగిలాడు.