శ్రీశైలంలో కనువిందు చేసిన లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి

శ్రీశైలంలో కనువిందు చేసిన లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి

కర్నూలు: భూ కైలాసగిరి అయిన శ్రీశైల క్షేత్రంలో  కార్తీకమాసోత్సవాల్లో భాగంగా లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కనువిందు చేసింది. కార్తీక నాలుగవ సోమవారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చిన నేపధ్యంలో దేవస్థానం అధికారులు.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్తీకమాసోత్సవాల నిర్వహించారు.  తెల్లవారుజాము నుంచే దర్శనాలకు విచ్చేసిన భక్తులకు దూరదర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు.  అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నాలుగు విడతలుగా ఆర్జిత అభిషేకాలు నిర్వహించారు.

ఆర్జిత అభిషేకాలలో మొదటి విడతను ఉదయం 6.30 గంటలకు, రెండో విడుతను ఉదయం 8.30గంటలకు, మూడవ విడతను ఉదయం 11.30గంటలకు, నాలగవ విడతను సాయంత్రం 6. 30గంటలకు జరిపించడం జరుగుతోంది.

 అలాగే ఆర్జిత హోమాలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రెండు విడతలుగా నిర్వహించారు. రుద్రహోమం..  మృత్యుంజయహోమాలలో  మొదటి విడత ఉదయం 8గంటలకు ఆ తర్వాత రెండవ విడత 9.30గంటలలకు జరిపించడం జరుగుతోంది.

చండీహోమం  మొదటి విడత ఉదయం 7.30గంటలకు,  రెండవ విడత ఉదయం 10గంటలకు జరిపించబడుతోంది.

భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో వేచి ఉన్న వారికి వేడిపాల వితరణ అలాగే భక్తులకు పొట్లాల రూపంలో అన్నప్రసాదాల అందజేయుడం జరుగుతోంది.

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ రోజు సాయంత్రం “పుష్కరిణి” వద్ద లక్షదీపోత్సవం మరియు పుష్కరిణి హారతి నిర్వహించారు. చీకటిపడ్డ తర్వాత విద్యుత్ దీపాల ధగ ధగలతో ఈ వేడుకలు కనువిందు చేశాయి. 

కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే  పుష్కరిణి హారతికి  భక్తులకు అనుమతిచ్చారు.  

for more News…

మన రైతులు యంత్రాలు వాడట్లే..

పుల్కాలు తింటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్