నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలతో పాటు పరివార ఆలయాల హుండీలను లెక్కించారు .
చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 61 లక్షల 81 వేల 535 రూపాయల నగదు లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 13 రోజులులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
హుండీ లెక్కింపులోలభించిన కానుకల వివరాలు
- నగదు : 5 కోట్ల 61 లక్షల 81 వేల 535 రూపాయలు
- బంగారం : 124 గ్రాముల 500 మిల్లి గ్రాములు
- వెండి : 5 కిలోల 550 గ్రాముల
విదేశీకరెన్సీ వివరాలు
- యూఎస్ ఏ డాలర్లు : 22
- యు.ఎ.ఇ దిర్హమ్స్ : 10
- సౌదీరియాల్స్ : 5
- సింగపూర్ డాలర్లు : 4
- ఇంగ్లాండు పౌండ్స్ : 25
- మలేషియా రింగిట్స్ : 1
- ఓమన్ బైసాలు : 100
- ఆస్ట్రేలియా డాలర్లు :15
- యూరోలు : 5
- కత్తారు రియాల్స్ : 1
- ఓమన్ రియాల్స్ : 1
- థాయిలాండ్ భట్స్ : 100
కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీ లెక్కింపు ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అన్ని విభాగాల సిబ్బంది.. శివ సేవకులు పాల్గొన్నారు.
