శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో మూడేండ్లుగా నిర్లక్ష్యమే

శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో మూడేండ్లుగా నిర్లక్ష్యమే

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో మూడేండ్లుగా వివిధ సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించకుండా తాత్కాలిక రిపేర్లతో నెట్టుకొస్తున్నారని ఇంజనీర్లు, స్టాఫ్ అంటున్నారు. ప్లాంట్‌‌లో సమస్యలపై పలుమార్లు పెద్దాఫీ సర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెప్తున్నా రు. అసలు ప్లాంట్ మెయింటెనెన్స్ కోసం అవసరమైన పరికరాల ఇండెంట్ మూడేండ్లుగా పెండింగ్లో ఉందని.. పవర్‌‌స్టేషన్‌‌ లో టెక్నికల్ ‌‌అప్‌ గ్రేడేషన్ ‌‌అవసరాన్ని పై ఆఫీసర్ల దృష్టికి  తెచ్చామని అంటున్నారు. మెయింటెనెన్స్ కు  అవసరమైన పరికరాలు, టెక్నికల్‌‌ ఎక్విప్‌మెంట్‌‌, రిపేర్లకు కావాల్సిన సామాగ్రి కోసం పెట్టిన ఇండెంట్‌‌పై ఎలాంటి నిర్ణయం  తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టారని ఆరోపిస్తున్నారు. బ్యాటరీలు, డైరెక్ట్కరెంట్‌‌ (డీసీ) సప్లైకి సంబంధించిన సమస్యకు కూడా టెంపరరీ రిపేర్లు చేయిస్తూ వచ్చారని చెప్తున్నారు. ఇన్నాళ్లు పట్టించుకోకుండా ఉండి.. సమస్య పెద్ద దయ్యాక గానీ ఎక్విప్ మెంట్ను మార్చే పని పెట్టుకున్నారని.. ఈ దశలో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తిందని అంటున్నారు.

ఆందోళన ఉన్నా పట్టించుకోక..

గత ఏడాది డ్యామ్‌‌ ల సేఫ్టీపై నేషనల్ కమిటీ సమా వేశంలో జరిగిన చర్చ సందర్భంగా విద్యుత్ ప్లాంట్ల నిర్వహణపై ఆందోళన వ్యక్తమైనా జెన్కో పట్టిం చు కోలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉందని, రిపేర్ల కోసం టెక్నికల్ స్టాఫ్ను పంపాలని కోరినా సకాలంలో స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. పవర్ జనరేషన్ ‌‌ముందే రిపేర్లు, మెయింటెనెన్స్  వర్క్ చేసి ఉంటే, ప్రమాదం తప్పేదని ప్లాంట్ స్టాఫ్ అంటున్నారు. ఇప్పుడు ఫైర్‌ సేఫ్టీ పై దృష్టి శ్రీశైలం ప్రమాదంతో కంగుతిన్న జెన్‌‌కో దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని థర్మల్‌‌, హైడల్‌‌ పవర్ స్టేషన్లలో భద్రతపై దృష్టి సారించింది. ప్లాంట్లలో ఫైర్‌‌సేఫ్టీ పరికరాలు, కంట్రోలింగ్ వ్యవస్థ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టం, లేటెస్ట్ అప్ గ్రేడ్లపై  నివేదికివ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.