
బ్రహ్మాస్త్రం మూవీ పార్ట్-1 శివలో కుంకుమలా పాట టీజర్ విడుదల అయింది. దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్న ఈ మూవీలో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మాస్త్రం మూవీ తొలి భాగం శివలో కుంకుమలా అనే పాట టీజర్ ను దర్శకుడు రాజమౌళి కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ప్రీతమ్ సంగీతం అందించిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జి దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్9న విడుదల కానున్న ఈ సినిమాను థియేటర్ లో చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
Here’s #Kumkumala song promo from #Brahmastra: Part One.
— rajamouli ss (@ssrajamouli) May 27, 2022
Excited to be presenting in Telugu.
See you in cinemas on September 9th! https://t.co/ZyDQzM9g8J
ఇవి కూడా చదవండి