
టెన్త్ పేపర్( 10th paper) లీక్ ఘటనకు నిరసనగా ఎన్ఎస్ యూఐ ఆందోళనకు దిగింది. అబిడ్స్ లోని SSS బోర్డు ముందు NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఆందోళన కారులు SSC బోర్డు , గేటును ధ్వంసం చేశారు. కార్యాలయంపైకి కోడి గుడ్లు విసిరారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను చెట్టుకు ఉరి వేసి తగులబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసివేసి దిష్టిబొమ్మను దహనం చేశారు నాయకులు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఎన్ఎస్ యూఐ నేతలకు మధ్య వగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బల్మూరి వెంకట్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా 10వ తరగతి(Tenth paper) పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించాలంటూ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు..లేకపోతే ప్రగతి భవన్ కు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
వాట్సప్ గ్రూప్ లో పేపర్ లీక్ చేసిన సందప్ప
వికారాబాద్ తాండూరులో టెన్త్ పేపర్ లీక్ అయినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో స్కూల్ అసిస్టెంట్ సందప్ప మొబైల్ నుంచి తెలుగు పేపర్ లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ లో ముగ్గురు అధికారులు సూపరింటెండెంట్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశారు .పేపర్ లీక్ పై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు అధికారులు.