V6 News

ముగిసిన టెన్త్ పరీక్షలు మే మొదటి వారంలో ఫలితాలు!

ముగిసిన టెన్త్ పరీక్షలు మే మొదటి వారంలో ఫలితాలు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి మెయిన్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మే మొదటి వారంలోనే ఫలితాలను వెల్లడించేందుకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరీక్షలు జరుగుతుండగానే బోర్డు సమాంతరంగా జవాబు పత్రాల వాల్యువేషన్ చేపట్టింది.

తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల వాల్యువేషన్ ప్రక్రియ పూర్తయింది. సైన్స్, సోషల్ సబ్జెక్టుల వాల్యువేషన్‌తో పాటు స్కానింగ్ ప్రక్రియ ఈ నెల 25 లోపు పూర్తి కానుంది. కాగా..సోమవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 5,17,760 మంది విద్యార్థులకు గానూ 5,16,534 మంది హాజరయ్యారు.