నేవీలో ఎస్‌‌ఎస్‌‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు

నేవీలో ఎస్‌‌ఎస్‌‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌‌‌‌ఏ)లో 2025, జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌‌ఎస్‌‌సీ) కోర్సులో అడ్మిషన్స్​కు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ అప్లికేషన్స్​ కోరుతోంది. 

పోస్టులు: మొత్తం 242 సర్వీసుల్లో జనరల్ సర్వీస్: 50, పైలట్: 20, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 18, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 8, లాజిస్టిక్స్: 30, నావల్ ఆర్మమెంట్ ఇన్‌‌స్పెక్టరేట్ కేడర్: 10, ఎడ్యుకేషన్‌‌: 18, ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 30, ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 50, నావల్ కన్‌‌స్ట్రక్టర్: 20 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, మెడికల్​ స్టాండర్డ్స్​ ఉండాలి. నెలకు రూ.56100 ఇస్తారు, ఇతర అలవెన్సులు  చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం www.joinindiannavy.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.