గెలాక్సీలో స్టార్ హవా.. సూపర్ స్టార్ సర్టిఫికెట్ చూశారా?

గెలాక్సీలో స్టార్ హవా.. సూపర్ స్టార్ సర్టిఫికెట్ చూశారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)  నేడు(ఆగస్ట్ 9) తన 48వ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా  క్రేజీ గా తన బర్త్ డేను గ్రాండ్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గెలాక్సీలో అత్యంత ఎక్కువగా ఇష్టపడే RA:12H33M29S అనే స్టార్​కు మహేశ్​ పేరున రిజిస్టర్​ చేయించారు

దీంతో మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ గా సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక మహేష్ పేరు మీద పై రిజిస్టర్ చేయించిన నక్షత్రం సర్టిఫికెట్.. సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతోంది. 

స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ ఈ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సర్టిఫికెట్ లో నక్షత్రం డీటెయిల్స్ కూడా ఉన్నాయి.దీంతో ఫస్ట్ టైం ఏ స్టార్ కు దక్కని అరుదైన రెస్పాన్స్ దక్కడంతో.. మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు సైతం హ్యాపీ గా ఉన్నారని తెలుస్తోంది. దీంతో మహేష్ రెస్పాన్స్ గురుంచి ఇండియా వైడ్ గా వెయిట్ చేస్తున్నారు. 

ప్రసెంట్ర్ మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తోన్నగుంటూరు కారం మూవీలో యాక్ట్ చేస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నెక్స్ట్ దర్శకధీరుడు రాజమౌళి(RajaMouli) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. దీని కోసం రైటర్ విజయేంద్ర ప్రసాద్ అద్దిరిపోయే అడ్వెంచర్ స్టోరీ రాస్తున్నారట. ఇక రాజమౌళి సినిమాతో మహేష్ పాన్ వరల్డ్ స్టార్ అయిపోవడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్.