- రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళీకేరీ
మెదక్ టౌన్, వెలుగు: జనగణనను సంబంధిత అధికారులు, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తించి వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతీ హోళికేరీ అన్నారు.
మంగళవారం మెదక్మున్సిపల్ ఆఫీస్‌లో, చేగుంట జడ్పీ హైస్కూల్‌లో కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ జనగణనను ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాల్సిందిగా సూచించారు.

