వికారాబాద్‎లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యటన.. ఈవీఎం గోడౌన్ ను పరిశీలన

వికారాబాద్‎లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యటన.. ఈవీఎం గోడౌన్ ను పరిశీలన

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్​ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్‎ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గురువారం పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టరేట్​కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

 అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్ తెరిచి, ఈవీఎంలు, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈవీఎంల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, డీఆర్​వో మంగీ లాల్, ఆర్డీవో వాసు చంద్ర, తహసీల్దార్ లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.