గ్రూప్–2, 3, 4లోకి మరికొన్ని పోస్టులు

గ్రూప్–2, 3, 4లోకి మరికొన్ని పోస్టులు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్-–2, 3, 4లోకి మరికొన్ని రకాల పోస్టులను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో నంబర్ 55కు సవరణ చేస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ డిపార్ట్​మెంట్లలో సిమిలర్ క్వాలిఫికేషన్​తో ఉన్న పోస్టులను గ్రూప్–2, 3, 4లలోకి చేర్చారు. వీటిలో గ్రూప్–2లోకి కొత్తగా 6 రకాల పోస్టులు చేరాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో పోస్టులు, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల వంటివి ఇందులో ఉన్నాయి.

గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–3లో మరో 2 రకాల పోస్టులను యాడ్ చేశారు. గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడీల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. ఇక గ్రూప్-–4లో మరో 4 రకాల పోస్టులు చేరాయి. ఇందులో జిల్లా ఆఫీసుల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు ఉన్నాయి. తాజా మార్పులతో పోస్టుల సంఖ్య కొంత పెరిగే చాన్స్ ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు.