రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలు షురూ.. ఖమ్మంలో రెండు రోజులపాటు జరుగనున్న క్రీడలు

రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలు షురూ.. ఖమ్మంలో రెండు రోజులపాటు జరుగనున్న క్రీడలు

రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలకు ఖమ్మం జిల్లా వేదికగా నిలిచింది. గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎస్​ఆర్​అండ్​బీజేఎన్​ఆర్​కాలేజీ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలను గురువారం సీపీ సునీల్ దత్ ప్రారంభించారు. ఈ పోటీలు రెండు రోజులపాటు జరుగున్నాయి. తెలంగాణలోని ఆయా జిల్లాల నుంచి మొత్తం 230 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.  – వెలుగు ఫోటోగ్రాఫర్, ఖమ్మం