పర్యాటక శోభ: కొండల నడుమ కొలువుదీరిన జలధార.. రామునిగుండాలకు కొత్త అందం

పర్యాటక శోభ: కొండల నడుమ కొలువుదీరిన జలధార.. రామునిగుండాలకు కొత్త అందం

ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రామగుండం ప్రాంతంలోని రాముని గుండాల కొండ కొత్త అందాన్ని సంతరించుకుంది. కొండ శిఖరాల పైనుంచి జాలువారుతున్న సహజ జలపాతాలు సందర్శకులను మైమరపిస్తున్నాయి. కొండల నడుమ ఉప్పొంగి ప్రవహిస్తున్న వర్షపు నీరు చూపరులను కట్టిపడేస్తోంది. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికత, అందం ఒకేచోట ఆవిష్కృతమవుతున్నాయి. కొండపై నుంచి కిందికి దుంకుతున్న జలధారల వద్ద భక్తులు ఉల్లాసంగా గడుపుతున్నారు. –