గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని గంగానగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం రాష్ట్ర స్థాయి ట్రాన్స్జెండర్ల సదస్సు జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఇందులోభాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జల్సా, ఆటా పాట, సారీ ఫంక్షన్, అమ్మవారి పూజలతో సందడి నెలకొంది.
చీఫ్ గెస్ట్‌గా హాజరైన అమ్మ తెలంగాణ ట్రాన్స్‌జెండర్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఓరుగంటి లైలా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ట్రాన్స్జెండర్లకు సముచిత స్థానాన్ని కల్పించిందని, మొదటిసారిగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం ఇండ్ల పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
ఐక్యతను చాటడంతో పాటు సమస్యలపై చర్చించేందుకు సమ్మేళనం నిర్వహించామని తెలిపారు. గోదావరిఖనికి చెందిన ట్రాన్స్ జెండర్లు లాస్య, శివానీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో భవానీ, సుష్మ, అనితశ్రీ, సమ్మవ్వ పాల్గొన్నారు.
