బాధిత మహిళలకు వెంటనే న్యాయం చెయ్యాలి : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌పర్సన్ నేరెళ్ల శారద

బాధిత మహిళలకు వెంటనే న్యాయం చెయ్యాలి :  రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌పర్సన్ నేరెళ్ల శారద
  • జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు మాకు పంపండి
  • రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌పర్సన్ నేరెళ్ల శారద

హైదరాబాద్ సిటీ, వెలుగు: బాధిత మహిళల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టి, వెంటనే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్​పర్సన్ నేరెళ్ల శారద సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్‌‌లో శనివారం జరిగిన సఖి కేంద్రాల అడ్మినిస్ట్రేటర్లు, సభ్యుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్​హరిచందనతో కలిసి ఆమె హాజరయ్యారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను రాష్ట్ర స్థాయికి పంపాలని, బాధితులకు మహిళా కమిషన్ తప్పక అండగా నిలుస్తుందన్నారు. 

కొత్తగా అమల్లోకి తెచ్చిన భారతీయ న్యాయ సంహిత, సురక్ష సంహిత, భారతీయ సాక్షా అదినియమ్ చట్టాలపై సఖి కేంద్ర సభ్యులకు అవగాహన కల్పించేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. కొత్త చట్టాల ద్వారా బాధిత మహిళలకు న్యాయం చేకూర్చేలా సఖి కేంద్ర అడ్మినిస్ట్రేటర్లు, సభ్యులు కృషి చేయాలని సూచించారు.