నిన్న హైదరాబాద్ లో సీపీఆర్ చేసి బాలరాజు అనే యువకుడిని కాపాడిన కానిస ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కానిస్టేబుల్ సమయస్ఫూర్తిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందలు తెలియజేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.. రాజశేఖర్‌ను అభినందించారు. అతడిని నగదు బహుమతితో సత్కరించారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న బాలరాజుకు అకస్మాత్తుగా గుండెపోటుకు గురికాగా.. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సీపీఆర్ చేసి అతనిప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన నిన్న ఆరాంఘర్ చౌరస్తాలో జరిగింది. బాధితుడు 2 నిమిషాల అనంతరం సృహలోకి వచ్చాక 108లో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాన్ని కాపా డిన కానిస్టేబుల్ రాజశేఖర్‌ను మంత్రి హరీశ్ రావుసైతం అభినందించారు. ట్రాఫిక్ పోలీసులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సీపీఆర్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ట్రైనింగ్‌ను వారం రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు ట్విటర్ లో వెల్లడించారు.
