భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

 భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 900 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతోంది. 250 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడవుతోంది నిఫ్టీ. నిన్న అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్ సూచీలు కూడా పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు 5 శాతం... డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ రేటు 6 శాతం పెరిగాయి.
మంగళూరు రిఫైనరీ, ఓరియంట్ సిమెంట్, కల్పతరు పవర్, జీహెచ్ సీఎల్ షేర్లు భారీగా లాభపడగా... రిలాక్సో ఫుట్ వేర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్గీ ఎక్విప్ మెంట్స్, ప్రిసమ్ జాన్సన్ షేర్లు భారీగా కుంగాయి. స్థిరాస్తి సూచీ ఒక్కటే లాభాల్లో కొనసాగుతోంది. మిగిలిన సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా టెలికాం సూచీ 1 శాతం పతనమైంది. సాయంత్రం వరకు కొనుగోళ్ల మద్దతు లభించకపోతే భారీ నష్టాలు తప్పేలా లేవు. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోనుంది.