IND vs ENG: ఈ సారి కోహ్లీతో కలిసి ఆడలేకపోవడం సిగ్గుచేటు.. ఇంగ్లాండ్ కెప్టెన్ విచారం

IND vs ENG: ఈ సారి కోహ్లీతో కలిసి ఆడలేకపోవడం సిగ్గుచేటు.. ఇంగ్లాండ్ కెప్టెన్ విచారం

విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు దిగ్గజాలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫామ్.. ఫిట్ నెస్ ఉన్నపటికీ విరాట్ టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలగడం ఆశ్చర్యానికి గురి చేసింది. రిటైర్మెంట్ వెనుక కారణాన్ని కోహ్లీ ఏ సందర్భంలోనూ చెప్పలేదు. బీసీసీఐ ఒత్తిడి కారణంగానే గుడ్ బై చెప్పాడని కొందరు అంటుంటే యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడానికే వీడ్కోలు చెప్పాడని మరికొందరు భావిస్తున్నారు. ఇంగ్లాండ్ తో జరగబోయే కఠిన సిరీస్ కు కోహ్లీ లేకపోవడం భారత్ కు పెద్ద మైనస్  కానుంది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై తాజాగా బెన్ స్టోక్స్ తన విచారాన్ని వ్యక్తం చేశాడు.

తాను ఎంతో ఇష్టపడే ఫార్మాట్ నుంచి కోహ్లీ వైదొలగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నేను విరాట్ కు స్వయంగా మెసేజ్ చేశానని స్టోక్స్ వెల్లడించాడు. "ఈ సారి కోహ్లీతో ఆడకపోవడం సిగ్గుచేటు అని నేను అతనికి మెసేజ్ చేశాను. నాకు విరాట్‌తో ఆడటం చాలా ఇష్టం. మైదానంలో మా ఇద్దరి మనస్తత్వం ఒకేలా ఉంటుంది. మేము ఎల్లప్పుడూ పోటీని ఆస్వాదిస్తాము". అని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన వీడియోలో స్టోక్స్ అన్నాడు. గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ, స్టోక్స్ ఇద్దరూ కూడా దూకుడుగా వ్యవహరిస్తారు. వీరి అగ్రెస్సివ్ సెలెబ్రేషన్ తో జట్టులో ఫైటింగ్ స్పిరిట్ నింపుతారు.  

కోహ్లీ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్‌‌‌‌లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్‌‌‌‌) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి. ఇక స్టోక్స్ విషయానికి వస్తే జూన్ 20 నుంచి టీమిండియాతో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఈ ఇంగ్లాండ్ కెప్టెన్ ఆట కోసం తన అలవాటు మార్చుకున్నాడు. కాలి కండరాల (హ్యామ్‌‌‌‌‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌‌‌‌‌) గాయం నుంచి తొందరగా కోలుకొని ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యేందుకు మందు తాగడం  మానేశాడు. 33 ఏండ్ల స్టోక్స్ గతేడాది ది హండ్రెడ్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో గాయపడ్డాడు.