ఎన్నికలయ్యే దాకా రైతుబంధు ఆపండి.. ఈసీకి ఎఫ్​జీజీ సెక్రటరీ లేఖ

ఎన్నికలయ్యే దాకా రైతుబంధు ఆపండి.. ఈసీకి ఎఫ్​జీజీ  సెక్రటరీ లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో పోలింగ్ ముగిసే వరకు రైతు బంధు ఆపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి కోరారు. గురువారం ఈ అంశంపై కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు. పోలింగ్ కు ముందు రైతు బంధు ఇవ్వాలని చూస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. రైతు బంధు కొత్త స్కీమ్ కాదని, ఆన్ గోయింగ్ స్కీమ్ అని, దీనికి ఎన్నికల కోడ్ వర్తించదని అధికార పార్టీ నేతలు అంటున్నారని, పాత స్కీమ్ అయినా ఎన్నికల టైమ్ లో ఇవ్వడం అంటే రైతుల ఓట్ల కోసమే ఇచ్చినట్లుగా భావిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు.

రాష్ర్టంలో 60 వేల రైతు కుటుంబాలకు రైతు బంధు అందనుందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయన్నారు. రాష్ర్టంలో వరి కోతలు ఇంకా స్టార్ట్ కాలేదని, ఈ యాసంగిలో ఎంత సాగు చేస్తారో కూడా ఇప్పటికి క్లారిటీ లేదని, అలాంటపుడు రైతు బంధు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.  రైతు బంధు ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం అధికార పార్టీ చేస్తోందని, ఇలాంటి వాటిని ఈసీ అడ్డుకోవాలని పద్మనాభరెడ్డి కోరారు.