
ఖైరతాబాద్, వెలుగు: స్ట్రీట్ కాజ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఆదివారం పీపుల్స్‌ప్లాజాలో 5కె రన్నిర్వహిస్తున్నట్టు పల్లవి ఫౌండేషన్సీఈఓ యశస్వి మల్క తెలిపారు. ఉదయం 6 గంటలకు రన్ప్రారంభమవుతుందని తెలిపారు. ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పల్లవి గ్రూప్విద్యాసంస్థల చైర్మన్ఎం.కొమరయ్య పాల్గొంటారన్నారు. 5కె రన్లో దాదాపు10 వేల మంది స్టూడెంట్లు పాల్గొంటారని చెప్పారు. రన్ప్రారంభానికి యుందు జుంబా డ్యాన్స్‌తోపాటు వివిధ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని స్ట్రీట్కాజ్సీఈఓ శృతి, ప్రెసిడెంట్సాహితిసాయి తెలిపారు.