V6 News

నువు దేవుడివి సామీ.. వేడి వేడి నూనెలో చేయి పెట్టినా ఏం కాలేదు

నువు దేవుడివి సామీ.. వేడి వేడి నూనెలో చేయి పెట్టినా ఏం కాలేదు

వేడి వేడి నూనే...అందులో ఏది వేసినా..మలమల మాడిపోతుంది. పిండి వంటి పదార్థాలు వేస్తే..ఇక సెకన్లలో ఫ్రై అవుతాయి. మరి మనిషి చేయి పెడితే..వామ్మో తలుచుకోవడానికి భయం వేస్తుందా..? అవును. వేడి వేడి నూనేలో చేయి పెడితే..చర్మం పూర్తిగా కాలిపోయి..బొక్కలు తేలడం ఖాయం. కానీ ఓ వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదు. అతను వేడి వేడి నూనెలో చేయిని సులభంగా పెట్టేస్తున్నాడు. నీళ్లలో పెట్టినంత ఈజీగా నూనెలో చేయిని తన గరిటలెక్క ఉపయోగిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

ఓ వ్యక్తి పాలకూర భజియా తయారు చేస్తున్నాడు. ముందుగా ఓ భారీ గిన్నెలో తరిగిన పాలకూరను వేసుకున్నాడు. ఆ తర్వాత దాంట్లో శనగపిండి, కారం, ఉప్పు, ఇతర పదార్థాలు వేసుకుని మంచిగా కలుపుకున్నాడు. ఆ తర్వాత  తన చేత్తో భారీ కడాయిలో పాలకూర భజియా వేయడం ప్రారంభించాడు. కొన్ని వేసిన తర్వాత..ఒక్కసారిగా అతను వేడి వేడి నూనెలో తన చేయిని ముంచాడు. ఫ్రై అవుతున్న భజియాను నీళ్లలో వస్తువును జరిపినట్లు జరిపాడు. ఈ ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఈ వీడియోపై నెటిజన్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వేడి వేడి నూనెలో చేయిపెట్టిన చెఫ్ ను పొడగ్తల్లో ముంచెత్తున్నారు. అతన్ని ఐరెన్ మ్యాన్గా పోల్చారు.