30వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

30వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఆర్టీసీ కార్మికుల సమ్మె 30వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా డిపోల ముందు ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు కార్మికులు. అయితే సీఎం కేసీఆర్… కార్మికులకు ఇచ్చిన డెడ్ లైన్ పై కాసేపట్లో  సమావేశం కానునున్నారు నేతలు. టీఎంయూ ఆఫీసులో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అవుతారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత భవిష్యత్ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. అయితే సమ్మె యథావిధిగా కొనసాగుతుందన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.

మరోవైపు ఆర్టీసీ జేఏసీ నిన్న ప్రకటించిన కార్యాచరణ ప్రకారం….అన్ని డిపోల దగ్గర,  గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు నేతలు. ఉదయాన్నే డిపోల ముందు నిరసన తెలుపుతున్నారు నేతలు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు ఆర్టీసీ కార్మికులు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.