- మోత్కూరు చైర్మన్ ఎస్సీ మహిళకు కేటాయింపు
- ఆలేరుకు బీసీ మహిళకు రిజర్వ్
యాదాద్రి, వెలుగు: చైర్మన్ సీటు దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్నాయి. రిజర్వ్ అయిన చైర్మన్ సీట్ల కోసం జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ, బీసీ మహిళలను పోటీకి దించాయి. యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 104 వార్డులు ఉన్నాయి.
ఈ ఆరింటిలో మోత్కూరు ఎస్సీ మహిళకు, ఆలేరు బీసీ మహిళకు రిజర్వ్అయ్యాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్జనరల్మహిళలకు రిజర్వ్అయ్యాయి. భూదాన్ పోచంపల్లి మాత్రమే జనరల్‌గా ఉంది. ఇక వార్డుల విషయానికొస్తే బీసీలకు 31, ఎస్సీలకు 14, ఎస్టీలకు 6, జనరల్‌కు 53 రిజర్వ్ అయ్యాయి.
మోత్కూరు జనరల్వార్డుల్లో ఎస్సీ మహిళలు పోటీ..
మోత్కూరు మున్సిపాలిటీ ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్అయింది. ఈ మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 2వ వార్డు ఎస్సీ మహిళ, 6వ వార్డు ఎస్సీ జనరల్‌గా రిజర్వ్ అయ్యాయి. దీంతో చైర్మన్ సీటు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న పార్టీలు ప్లాన్ మార్చుకున్నాయి. ఎస్సీ జనరల్‌వార్డులో ముగ్గురు పోటీ చేస్తుండగా కాంగ్రెస్, బీజేపీ ఎస్సీ మహిళలను రంగంలోకి దించాయి. 4 అన్ రిజర్వ్డ్వార్డుల్లో ఎస్సీ మహిళలను రంగంలోకి దించాయి. 1, 8వ వార్డుల్లో ఇండిపెండెంట్లు, 5లో బీఆర్ఎస్, 12వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ఇద్దరు ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు.
ఆలేరు జనరల్ వార్డుల్లో బీసీ మహిళ..
ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 10వ వార్డు బీసీ మహిళ, 8వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. అయితే చైర్మన్ సీటు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో జనరల్ వార్డుల్లో మహిళలను పోటీ చేయిస్తున్నారు. జనరల్ వార్డు 1లో బీజేపీ బీసీ మహిళను పోటీకి దింపింది.
జనరల్ మహిళా వార్డులైన 4లో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, 7వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, 12లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మహిళలను పోటీకి దించాయి. బీసీ జనరల్ ఐదులో బీఆర్ఎస్, 8లో కాంగ్రెస్ మహిళలను పోటీ చేయిస్తున్నాయి. భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో చైర్మన్ సీట్లు జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి.
