విద్యార్థిని కొట్టిన టీచర్ పై కేసు

విద్యార్థిని కొట్టిన టీచర్ పై కేసు

కుషాయిగూడ, వెలుగు: ప్లే స్కూల్లో చిన్నారిని కొట్టిన టీచర్ పై కేసు నమోదైంది. కూషాయిగూడ ఎస్సై గిరి కథనం ప్రకారం..కాప్రా హౌసిం గ్ బోర్డు కాలనీలో నివసించే విపిన్ చంద్ర (4) తల్లిదండ్రులు హ్యాపీ డేస్ ప్లే స్కూల్లో చదివిస్తున్నారు. బుధవారం అల్లరి చేస్తున్నాడంటూ విపిన్ చెంపపై కొట్టింది టీచర్. బాలుడి తండ్రి సతీష్ కుమార్ .. ప్రిన్సిపాల్ కు చెప్పినా.. ‘మీవాడు రోజు ఇలాగే అల్లరిచేస్తుం టాడు’ అని  సమాధానం ఇచ్చారు. దీంతో సతీష్‍ కుమార్‍  పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.