పెండింగ్ స్కాలర్ షిప్‌లు విడుదల చేయాలె : బీజేవైఎం నేతలు

పెండింగ్ స్కాలర్ షిప్‌లు విడుదల చేయాలె : బీజేవైఎం నేతలు

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలంటూ కూకట్ పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద బీజేవైఎం నేతలు ధర్నాకు దిగారు. రూ.18 లక్షల మేర స్కాలర్ షిప్ లు పెండింగ్ లో ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. వర్సిటీ మెయిన్ గేటు వద్ద బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నేతల ఆందోళనతో జేఎన్టీయూ వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. బీజేవైఎం నేతలు యూనివర్సిటీలోకి చొచ్చుకొని  వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బీజేవైఎం నేతలను అరెస్టు చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు.