డాక్టర్​ అయ్యేందుకు ఆపన్న హస్తం కోసం ఓ విద్యార్థి ఎదురుచూపు

డాక్టర్​ అయ్యేందుకు ఆపన్న హస్తం కోసం ఓ విద్యార్థి ఎదురుచూపు

తొర్రూరు, వెలుగు : డాక్టర్​ చదవాలని ఆశపడ్డ ఓ పేద విద్యార్థి ఆర్థిక స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన  కడెం గోపాల్, లక్ష్మి దంపతుల కొడుకు రవి ఖాజీపేటలోని మడికొండ సోషల్ ​వెల్ఫేర్ ​కాలేజీలో ఇంటర్ చదివి 876 మార్కులు సాధించాడు. హైదరాబాద్​లోని గవర్నమెంట్ సోషల్​ వెల్ఫేర్​ కోచింగ్​సెంటర్​లో  శిక్షణ తీసుకున్నాడు. మొన్న జరిగిన నీట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో4117 ర్యాంకు సాధించాడు. దీంతో అతడికి సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చింది. 

అయితే హాస్టల్​, లైబ్రరీ, ఇతర ఫీజులు కలిపి ఏడాదికి రూ.లక్షన్నర వరకు కట్టాల్సి  వస్తోంది. వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్న రవి తల్లిదండ్రులు అంత డబ్బును కట్టే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికే మరో కొడుకును బీటెక్​చదివిస్తున్నారు. తాము రాత్రి పగలు పని చేసినా నెలకు రూ.20 వేలు కూడా సంపాదించలేకపోతున్నామని, ఎవరైనా దాతలు స్పందించి తమ కొడుకు చదువుకు సాయం చేయాలని కోరుతున్నారు. 9391751331 నంబర్​కు ఫోన్ పే, పేటీఎం చేస్తే రుణపడి ఉంటామంటున్నారు.