ఎగ్జామ్ సెంటర్ మార్చడంతో విద్యార్థుల ఆందోళన

ఎగ్జామ్ సెంటర్ మార్చడంతో విద్యార్థుల ఆందోళన

సూర్యాపేట జిల్లా కోదాడ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. అనురాగ్ కాలేజీలో సెంటర్ పేరుతో విద్యార్థులకు హాల్టికెట్స్ ఇచ్చారు. దీంతో ఎగ్జామ్ రాయడానికి సెంటర్కు వెళ్లగా.. అక్కడ ఎగ్జామ్ సెంటర్ లేదని సిబ్బంది చెప్పారని విద్యార్థులు వాపోయారు. 

అనురాగ్ కాలేజీలోని ఎగ్జామ్ సెంటర్ను సంగారెడ్డికి మార్చినట్టు సిబ్బంది తెలిపారు. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎగ్జామ్ సెంటర్ ఎలా మారుస్తారని విద్యార్థులు మండిపడుతున్నారు.