పెంచిన పరీక్ష ఫీజులు తగ్గించాలి.. జేఎన్టీయూలో విద్యార్థుల ధర్నా

పెంచిన పరీక్ష ఫీజులు తగ్గించాలి.. జేఎన్టీయూలో విద్యార్థుల ధర్నా

కూకట్​పల్లి, వెలుగు: పెంచిన పరీక్ష ఫీజులు తగ్గించాలని జేఎన్టీయూలో గురువారం స్టూడెంట్స్​ప్రొటెక్షన్​ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వర్సిటీ యాజమాన్యం ఫీజుల విషయంలో వ్యాపార ధోరణితో ఆలోచించడం బాధాకరమన్నారు. అన్ని రకాల ఫీజులను పెంచాలని నిర్ణయించడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రూ. 765 నుంచి రూ.1500కు పెంచిన పరీక్ష ఫీజులను, రూ.500 నుంచి రూ. 1500 కు పెంచిన ఆన్​లైన్​ సర్వీసెస్​ ఫీజులను యథావిధిగా ఉంచాలని డిమాండ్​ చేశారు. గ్రేస్​మార్కులు, పీసీ, సీఎంఎంలకు ప్రాసెసింగ్​ ఫీజుగా రూ. 2000గా నిర్ణయించటాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫోరం నాయకులు సాయితనూజ, జయరాం, దుర్గాప్రసాద్​, చంద్రశేఖర్, రాజ్​కుమార్ పాల్గొన్నారు.