యాదాద్రి, వెలుగు : ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను స్టూడెంట్స్ వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రిలో నిర్వహించిన విద్య విజయోత్సవంలో ఆయన మాట్లాడారు.
ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన స్టూడెంట్స్ మంచి మార్కులు సాధించడం ఆనందంగా ఉందన్నారు.
