బడి..కాదు గుడి..రెండేళ్లుగా ఆలయంలోనే తరగతులు

బడి..కాదు గుడి..రెండేళ్లుగా ఆలయంలోనే తరగతులు

విద్యాశాఖకు చెందిన ఇద్దరు ఆఫీసర్లు స్కూల్ ను సందర్శించేందుకు మారుమూల పల్లెకు వెళ్లారు. ఆ ఊరిలో సర్కారు బడికి భవనం లేకపోవడం, బడి మూతపడకుండా ఉండేందుకు టీచర్ల బృందం ఆలయంలో తరగతులను కొనసాగించడం వంటి అంశాలు ఆ అధికారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వత్  గ్రామంలోని స్కూల్ లో 120 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఐదుగురు టీచర్లున్నారు. స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. దీంతో రెండేళ్లుగా 60 మంది చిన్నారులను గుడిలో, మరో 60 మందిని పంచాయతీ ఆఫీస్ లో కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖకు చెందిన అకడమిక్ మానిటరింగ్ అధికారి వెంకటరమణ, ఎంఈవో సుభాష్ మంగళవారం గ్రామానికి వెళ్లి చూడడంతో విషయం అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే గ్రామ సర్పంచ్ జ్యోతిని కలిసిన అధికారులు స్కూల్ కు స్థలం ఇవ్వాలని కోరారు. స్థలం త్వరగా ఇస్తే వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలోపు భవన నిర్మాణం పూర్తిచేసి అందులో తరగతు లను కొనసాగిస్తామని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సర్పంచ్ తో పాటు గ్రామస్తులు హామీనిచ్చారు. ఆలయంలో తరగతులను కొనసాగిం చేందుకు కృషి చేసిన టీచర్ల బృందాన్ని సందర్శన అధికారులు అభినందించారు.