పోటీ పరీక్షలకు ట్రైనింగ్ కోసం స్టడీ సర్కిల్

పోటీ పరీక్షలకు ట్రైనింగ్ కోసం స్టడీ సర్కిల్

హైదరాబాద్, వెలుగు: వివిధ పోటీ పరీక్షలకు సిద్ధవుతున్న వేలాది మంది యువతీయువకులకు ఎక్స్ పీరియన్స్ ఉన్న అధ్యాపకులతో ట్రైనింగ్, అనుభవజ్ఞులైన ఉన్నతాధికారుల స్పూర్తిని అందించాలనే ఆశయంతో అశోక్ నగర్ లో వచ్చే నెల మొదటి వారంలో ఆస్పిరెంట్స్ స్టడీ సర్కిల్ ను  ప్రారంభిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ మేడిశెట్టి తిరుమల కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి  గురువారం హైదర్ గూడలోని సెంట్రల్ పార్క్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్ –-1, గ్రూప్–-2 పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ట్రైనింగ్ బ్యాచ్​లు ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తున్నామన్నారు.  భవిష్యత్ లో యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కు, రైల్వే, బ్యాంక్, పోలీస్, టీచర్ల నియామక పరీక్షలకు కావాల్సిన ట్రైనింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. తమ బ్రాంచ్ లో అన్ని కోర్సులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంటాయన్నారు. ఫిజికల్ గా కోర్సులకు హాజరుకాలేని వారి కోసం ఆన్ లైన్ లో కూడా నిర్వహిస్తామన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి బ్యాచ్ లో జాయిన్ అయ్యే వారికి అకామిడేషన్ ఫెసిలిటీ  ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఉండే యువతీ, యువకుల కోసం స్టడీ సర్కిల్ శాఖలను పలు పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. స్టడీ సర్కిల్ కు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదవిన బొలగం నేహా,  సలహామండలి సభ్యులుగా అంగంపల్లి దినకర్ బాబు(ఐఏఎస్), బండి మరియకుమార్(ఐపీఎస్), పుల్లా గణేశ్వరరావు, గుజ్జుల శివకుమార్ రెడ్డి ఉన్నారని తెలిపారు.   ప్రెస్ మీట్ లో స్టడీ సర్కిల్ ముఖ్య సలహాదారుడు వై. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.