రూ.25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ నరేశ్​

రూ.25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ నరేశ్​
  • అప్పు తీర్చడానికి గడువు ఇప్పిస్తానని డబ్బులు డిమాండ్​

 భూపాలపల్లి అర్భన్​, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్​స్టేషన్​లో మొదటి ఎస్సై ఇస్లావత్ నరేశ్​ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. వరంగల్​ ఏసీబీ డీఎస్పీ హరీశ్​ కుమార్ ​కథనం ప్రకారం.. కరీంనగర్​కు చెందిన ఉదయ్ శంకర్ భూపాలపల్లిలో ఏసీల బిజినెస్​ చేస్తున్నాడు. ఇందులో భాగంగా కొందరి దగ్గర రూ.30 లక్షలు అప్పు చేశాడు. తిరిగివ్వకపోవడంతో అప్పులిచ్చిన వారు భూపాలపల్లి పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

విచారణ కోసం ఉదయ్​ శంకర్​ను స్టేషన్​కు పిలిపించిన ఎస్సై నరేశ్​ అప్పు తిరిగివ్వాలని ఒత్తిడి తెచ్చాడు. గడువు కావాలని అడగడంతో లంచం ఇస్తే అలాగే జరుగుతుందని మాటిచ్చాడు. దీంతో ఉదయ్​ శంకర్ ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల సూచనలతో శుక్రవారం మొదటి విడతగా రూ.25  వేలను ఎస్సై క్వార్టర్​లో ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నరేశ్ ​సొంత గ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంగయ్యబంజర్ లోని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. నరేశ్​ను హైదరాబాద్​కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు.