ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలోని ఆద్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో పేషెంట్ కడుపులోని నాలుగున్నర కేజీల కణితిని ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా సక్సెస్ చేసినట్లు ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సతీశ్ కుమార్ తెలిపారు.
ఖమ్మం సిటీకి చెందిన 50ఏండ్ల మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆద్య హాస్పిటల్ లో చేరగా, పరీక్షలు నిర్వహించి ఆమె కడుపులో ఉన్న కణితిని తొలగించినట్లు చెప్పారు. సర్జరీ సక్సెస్ చేసినందుకు రోగి బంధువులు డాక్టర్ సతీశ్ కుమార్, డాక్టర్ నారగాని రాంప్రసాద్ (ఎంబీబీఎస్, జనరల్ మెడిసిన్)కు కృతజ్ఞతలు తెలిపారు.
