కరీంనగర్ సిటీ.వెలుగు: కరీంనగర్ సిటీలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి కొత్త పనులకు టెండర్లు ఖరారు చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సుడా పనులపై ఇంజినీరింగ్ అధికారులతో రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుడా కమర్షియల్ బిల్డింగ్ మొదటి విడత పనులు చివరి దశకు వచ్చాయని, అది పూర్తికాగానే మిగతా పనులకు టెండర్లు పిలవాలన్నారు. రాజీవ్ చౌక్ లో కొత్తగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం, రాజీవ్ చౌక్ సుందరీకరణ పనులను వచ్చే నెల 21 లోగా పూర్తి చేయాలని సూచించారు.

