లిక్కర్ షాపుల లక్కీ డ్రా నిలిపేశారంటూ ఆత్మహత్యాయత్నం

లిక్కర్ షాపుల లక్కీ డ్రా నిలిపేశారంటూ ఆత్మహత్యాయత్నం

లిక్కర్ షాపుల తక్కువగా దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రాను నిలిపేశారు అధికారులు. దీంతో దరఖాస్తు దారులకు, అధికారులకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తుండగా సారంగాపూర్ మండలం కేంద్రంలో  గెజిట్ నెం. 43లో 6 దరఖాస్తులే వచ్చాయంటూ అధికారులు డ్రా నిలిపేశారు. లిక్కర్ షాపులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాలని ఆరుగురు దరఖాస్తుదారులు డిమాండ్ చేశారు. వెంటనే డ్రా తీయాలంటూ కాసారపు రమేశ్ అనే దరఖాస్తు దారుడు డీజిల్ పోసుకొని ఆత్మహత్య  చేసుకుంటానంటూ వరి పొలాల్లోకి పరుగులు తీశాడు. వెంటనే అలర్టైన పోలీసులు యువకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సర్ది చెప్పి ఆత్మహత్యయత్నం విరమింప జేశారు.

 ఇప్పటికే 18 లక్షలు పెట్టినా ఒక్క షాపులో కూడా తమకు డ్రా రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన రమేశ్. తక్కువ టెండర్లు వచ్చాయనే కారణంగా అధికారులు డ్రా ఆపేసారని..ఎక్కువ టెండర్లు వస్తే అందులో నుంచి మాకు డబ్బులేమైనా ఇస్తారా అంటూ నిలదీశాడు రమేశ్.