గాంధీ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

గాంధీ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: జీతాలు రాకపోవడంతో గాంధీ హాస్పిటల్లో నాల్గవ తరగతి ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని గాంధీలోని బర్న్స్ వార్డ్ లోకి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. నాలుగు నెలల జీతం పెండింగ్ ఉండగా… సోమవారం 2 నెలల జీతం మాత్రమే పడిందని చెబుతున్నారు గాంధీ హాస్పిటల్ నాల్గవ తరగతి ఉద్యోగులు. దీంతో కుటుంబంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను మేనేజ్ చెయ్యలేక నిప్పంటించుకున్నాడు పేషంట్ కేర్ గా పనిచేస్తున్న ఓ వర్కర్. నెల నెలా జీతాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఔట్ సోర్సింగ్ సిబ్బంది. ఈ విషయంపై హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రభుత్వానికి ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు సిబ్బంది.