డివోషనల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ గా మహేంద్రగిరి వారాహి 

డివోషనల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ గా మహేంద్రగిరి వారాహి 

సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మిస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’.  తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘టీజర్ చాలా బాగుంది. పాజిటీవ్ ఫీలింగ్ కలిగింది.  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌‌‌తో సూపర్ మ్యూజిక్‌‌‌‌తో టీజర్ సాగింది.  ఈ సినిమా కచ్చితంగా  విజయం సాధిస్తుందని అనిపిస్తోంది. 

సుమంత్ గారికి ఈ చిత్రంతో మరో బిగ్గెస్ట్ హిట్ రావాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. కార్యక్రమంలో పాల్గొన్న సుప్రియ యార్లగడ్డ ఈ  సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు. హీరో సుమంత్ మాట్లాడుతూ ‘ఇదొక డివోషనల్ థ్రిల్లర్.  టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా.  టీమ్ అంతా కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నాం, కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం’ అని చెప్పాడు.  ఈ చిత్రంలోని స్ర్కీన్‌‌‌‌ప్లే చాలా కొత్తగా ఉంటుందని, క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారని  దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పాడు.  

ఈ చిత్రాన్ని వారాహి అమ్మవారు ముందుండి నడిపించారని నిర్మాత మధు అన్నారు.  హీరోయిన్ మీనాక్షి గోస్వామి,  రాజీవ్ కనకాల, అలీ, మంజు భార్గవి, మ్యూజిక్ డైరెక్టర్  అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.