మే 1 నుంచి జూన్ 2 వరకు.. హైకోర్టుకు సమ్మర్ హాలిడేస్

మే 1 నుంచి జూన్ 2 వరకు.. హైకోర్టుకు సమ్మర్ హాలిడేస్

హైదరాబాద్, వెలుగు: హైకోర్టుకు మే 1 నుంచి జూన్‌‌  2 దాకా సమ్మర్‌‌ హాలిడేస్‌‌ను ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. శని, ఆదివారాలు కలిపితే 29 నుంచి జూన్‌‌ 4 దాకా సెలవులు. తిరిగి జూన్‌‌ 5న హైకోర్టు రీ ఓపెన్ అవుతుంది. అత్యవసర కేసుల విచారణకు వెకేషన్‌‌  కోర్టులు పనిచేస్తాయి. ప్రతి మంగళవారం అత్యవసర కేసులను దాఖలు చేయవచ్చు. వాటిపై ప్రతి గురువారం వెకేషన్‌‌  కోర్టు విచారణ చేపడుతుంది.